తమలపాకు రసంలో తేనె కలుపుకుని సేవిస్తే....

గురువారం, 29 మార్చి 2018 (18:46 IST)
తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పిల్లలకు వచ్చే జ్వరం నుంచి ఉపశమనం లభించాలంటే.. తమలపాకు రసంలో కస్తూరిని కలిపి పేస్ట్‌లా చేసుకుని తేనెతో కలిపి ఇవ్వడం చేస్తే జ్వరం తగ్గిపోతుంది. దగ్గు, జలుబును కూడా ఇది నయం చేస్తుంది. తమలాపాకును కాసింత వేడి చేసి అందులో ఐదు తులసీ ఆకులను ఉంచి నులిమి రసం తీసుకుని 10 నెలల పిల్లలకు 10 చుక్కలు రోజూ ఉదయం, సాయంత్రం ఇస్తే జలుబు, దగ్గు నయం అవుతుంది. 
 
1. తమలపాకును రుబ్బుకుని కీళ్లవాతం, మోకాళ్ల నొప్పులకు పూతలా వేసుకుంటే.. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకు రసం 15 మిల్లీ లీటర్లు తీసుకుని వేడినీటిలో కలిపి తీసుకుంటే ఉబ్బసం, తలనొప్పి, కడుపునొప్పి నయం అవుతుంది.  
 
2. శొంఠి, మిరియాలను సమంగా తీసుకుని తమలపాకు రసంలో తేనె కలుపుకుని సేవిస్తే ఆస్తమా నయం అవుతుంది.
 
3. ఊపిరితిత్తులకు సంబంధిత రోగాలను నయం చేసుకోవాలంటే.. తమలపాకు రసం, అల్లం రసం సమానంగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పిల్లల్లో అజీర్తికి చెక్ పెట్టాలంటే  తమలపాకుతో మిరియాలు చేర్చి కషాయం తీసుకుంటే సరిపోతుంది.
 
ఇక వేసవి ప్రారంభం కాగానే నోరూరించేవి మామిడిపండ్లు. తీపి రసాలను పంచే మామిడిపళ్లు చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, కంటి సమస్యలను నివారిస్తాయి. పూర్తిగా పండని మామిడి పండును తీసుకోవడం వల్ల శరీరంలో కొత్తకణాలు పుట్టుకొస్తాయి. ఇందులో ఉండే విటమిన్-సి వల్ల ఆహారంలోని ఐరన్‌ను గ్రహించే శక్తి పెరుగుతుంది. రక్తస్రావం కాకుండా కూడా నిరోధిస్తుంది. క్షయ, రక్తహీనత, రక్త విరేచనాలు వంటి వ్యాధులు రాకుండా శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
 
అదేవిధంగా పోషకాహారం లోపం వల్ల పిల్లల్లో వచ్చే రేచీకటి సమస్యలను కూడా మామిడి నిరోధిస్తుంది. కంటిలోని సమస్యలకు మామిడి పండు దివ్యౌషధంగా పనిచేస్తుంది. బాగా పండిన మామిడిలో విటమిన్ - ఎ పుష్కలంగా ఉండటం వల్ల జలుబు, సైనసైటిస్ తదితర సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు