వీర్యవృద్ధికి పనస పండు..!!

శనివారం, 9 జులై 2016 (14:11 IST)
పనస పండును తేనెలో తడిపి తీసుకుంటే మెదడు నరాలు బలపడతాయి. వాత, పిత్త వ్యాధులు దూరమవుతాయి. పనసలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు, ఆరోగ్యానికి బలాన్ని ఇస్తుంది. నరాలను బలపరుస్తాయి. రక్తాన్ని వృద్ధి చేస్తాయి. అంటువ్యాధులను దూరం చేస్తాయి. పనస లేత తొనల్ని వేయించి తీసుకోవడం ద్వారా పిత్తం తొలగిపోవ‌డంతో  వీర్యవృద్ధికి సహకరిస్తుంది. పనస వేరును పొడిని చర్మ సమస్యలపై రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
 
ఆంటీ-యాక్సిండెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండే పనసను మితంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ కారకాలను దూరం చేసుకోవచ్చు. మధుమేహాన్ని, గుండెపోటును నియంత్రించే పనసలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అజీర్తిని దూరం చేసుకోవచ్చు. కోలన్ క్యాన్సర్‌ను నయం చేసే ప‌న‌స పండులో ఉండే యాంటీ-యాక్సిడెంట్లు పైల్స్‌ను దరిచేరనివ్వదు. 
 
హై ఫైబర్ కలిగిన పనస పండు పైల్స్‌ను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా పనసలోని విటమిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది.చర్మ సౌందర్యానికి వన్నెతెస్తుంది. ఆస్తమాను తొలగించి, ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను, యాంటీ ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి