మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

ఠాగూర్

మంగళవారం, 8 జులై 2025 (12:16 IST)
మహారాష్ట్ర నవ నిర్మాణ నేత (ఎంఎన్ఎస్‌) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావెద్ షేక్ కుమారుడు రాహిల్ షేక్ మద్యం మత్తులో అర్థనగ్నంగాఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించడం రాజకీయం దుమారం రేపుతోంది. రాష్ట్రంలోమరాఠీయేతరులపై దాడులు కలకలం రేపుతున్న తరుణంలో, ఎంఎన్ఎస్ నేత కుమారుడు మద్యం మత్తులో ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 
 
తన తండ్రి పలుకుబడి కలిగిన వ్యక్తి అని రాహిల్ మహిళను బెదిరించే ప్రయత్నం చేసిన వీడియో వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి రాహిల్‌ను అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రాహిల్ వీడియోను శివసేన నేత సంజయ్ నిరుపమ్ రీ పోస్ట్ చేస్తూ ఎంఎన్ఎస్ తీర్పు విమర్శలు గుప్పించారు. మరాఠీ సంస్కృతికి పరిరక్షకులమని చెప్పుకునేవారి నిజస్వరూపం ఇదేనంటే ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మద్యం మత్తులో ఏ చేస్తున్నాడో తెలియని స్థితిలో ఓ ఎంఎన్ఎస్ నేత కుమారుడు మరాఠీ మహిళను దుర్భాషలాడాడని, అంతేకాకుండా తన తండ్రి రాజకీయ పలుకుబడిన ప్రదర్శించే ప్రయత్నం చేశాడని విమర్శించారు. వీళ్ల భాష పేరిట రౌడీయిజం తప్ప మరేమీ చేయపట్టేదని, ఎంఎన్ఎస్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇది అని పేర్కొంటూ తమ ప్రభుత్వం మారాఠీకి వ్యతిరేకం కాదని తాము బాషను ప్రోత్సహిస్తున్నామని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు