ఫస్ట్ లుక్ మాధవ్‌ను రూరల్ అవతార్‌లో పరిచయం చేస్తుంది. చెక్డ్ షర్ట్, లుంగీ ధరించి, మెడలో క్యాజువల్‌గా చుట్టుకున్న టవల్‌తో, మాధవ్ రగ్గడ్ రూరల్ హీరోగా కనిపించారు. అతని చెదిరిన జుట్టు, గడ్డం ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాయి. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఉంచబడిన ఒక గేదె, బలం, ఆధిపత్యాన్ని సూచిస్తుంది. మాధవ్ పొడవాటి కర్రను పట్టుకుని ఏదైనా సవాలును ఎదుర్కోవడానికి సిద్ధం గా వున్నట్లు కనిపించారు. పోస్టర్, టైటిల్ అదిరిపోయాయి.
వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వి.ఎస్.రూప లక్ష్మి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో మాధవ్ సరసన దీపా బాలు కథానాయిక గా నటిస్తోంది.
ఈ చిత్రానికి ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. దేవ్ రాథోడ్ ఎడిటర్, రాజ్‌కుమార్ మురుగేశన్ ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: మాధవ్, దీపా బాలు, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, V.S.రూపా లక్ష్మి