అలాగే రోజూ జీలకర్ర తినడం, దాని జ్యూస్ తాగడం వల్ల బొడ్డు చుట్టూరా ఉన్న కొవ్వుతో పాటు మీ శరీరంలోని ఇతర భాగాల్లో పెరుగుతున్న కొవ్వు కూడా తగ్గుతుంది. జీలకర్ర మీ జీర్ణవ్యవస్థకు సహాయపడి.. పేగులను ఆరోగ్యకరంగా ఉంచుతుంది.
జీలకర్రలో ఇనుము అధికంగా ఉంటుంది. మనిషి శరీరానికి అవసరమయ్యే ఇనుమును దీని ద్వారా తీసుకోవచ్చు. ఒక టీస్పూన్ జీరాలో 1.4 మి.గ్రా ఇనుము కలిగి ఉంటుంది. ఇది శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్స్ తొలగించడానికి ఉపయోగపడుతుంది. జీలకర్ర కొవ్వు కరిగించి, బరువు తగ్గేలా చేస్తుంది.