గర్భిణీలు కొర్రలను ఆహారంలో చేర్చుకుంటే?

మంగళవారం, 14 ఆగస్టు 2018 (10:51 IST)
కొర్రలలో కార్బోహైడ్రేట్స్‌తో పాటు పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉండడం వలన ఇవి శరీరంలోని చక్కెర స్థాయిలను తక్కువగా విడుదలయ్యేలా చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వలన డయోబెటిస్ వంటి వ్యాధులను నియంత్రించవచ్చును. అంతేకాకుండా ఈ కొర్రలు జీర్ణవ్యవస్థకు చక్కగా దోహదపడుతాయి.
 
కొర్రలలో గల అమైనో యాసిడ్స్ దెబ్బతిన్న కణాలను నయంచేసేందుకు సహాయపడుతాయి. గర్భిణీ మహిళలు వీటిని తరచుగా తీసుకోవడం కడుపులో  శిశువు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అదే సమయంలో పాలిచ్చే తల్లులకు పాలు పడేలా చేస్తాయి.  కొర్రలలో బి1, బి2, బి5, బి6 వంటి విటమిన్స్ అధికంగా ఉంటాయి. 
 
కొర్రలలో గల పొటాషియం రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడుతుంది. వీటిల్లో గల మెగ్నిషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాల వలన జుట్టు ఒత్తుగా పెరడమే కాకుండా చర్మం సౌందర్యానికి కూడా ఉపయోగపడుతాయి. శరీరంలోని కొవ్వును తగ్గించుటకు దోహదపడుతాయి. కొర్రలలో పాస్పరస్ ఎముకల బలాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు