ఉప్పును అతిగా తింటే బట్టతల ఖాయమా?

సోమవారం, 13 ఆగస్టు 2018 (13:40 IST)
'ఉప్పులేని కూర యొప్పదు రుచులకు 
పప్పులేని తిండి ఫలము లేదు 
అప్పులేనివాడె యధిక సంపన్నుడు 
విశ్వదాభిరామ వినురవేమ'
 
దేన్నైనా అతిగా తినడం ఎప్పుడూ అనర్థదాయకమే. ఇది ఉప్పుకు కూడా వర్తిస్తుంది. అందుకే ఉప్పును హిమ శత్రువుగా పేర్కొంటారు. ప్రతి వంటకానికీ రుచిని తెప్పించి, నాలుకని ఆకర్షించి, మనిషిని తనకు బానిసగా మార్చేశక్తి ఉప్పుకు ఉంది. దీనినే సోడియం క్లోరైడ్‌ అంటారు.
 
ముఖ్యంగా మనం వండుకునే విధానాల వల్ల స్వతస్సిద్ధమైన పరిమాణాలు తారుమారవుతాయి. అంటే పొటాషియం తగ్గి, సోడియం పెరిగిపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఉప్పును ఎక్కువగా తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. 
 
ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థవారి సూచన ప్రకారం ఒక వ్యక్తి రోజుకి మూడు నుంచి ఐదు గ్రాముల ఉప్పు తింటే సరిపోతుంది. కానీ మనం రోజుకి 15 నుంచి 20 గ్రాములు సేవిస్తున్నాం. ఇలా తినడం రోగాలకు దారి తీస్తుంది. అలాగే కలిగే నష్టాలేంటో ఓసారిపరిశీలిద్ధాం. 
 
* ఉప్పును అతిగా సేవిస్తే రక్తస్రావం పెరుగుతుంది. దాహం పెరుగుతుంది. బలం నశిస్తుంది.
* దంతాల సందుల్లో వాపు వస్తుంది. జుత్తు నెరుస్తుంది, బట్టతల వస్తుంది.
* చర్మంలో ముడతలు ఇంకా ఇతర చర్మ వికారాలు కలుగుతాయి. 
* నీటిని శరీరంలో నిల్వ ఉండేట్టు చేసి ఊబకాయం, వాపులు కలుగ చేస్తుంది. 
* రక్త నాళాల లోపలి పొరను గట్టిపరచి రక్తప్రసరణకు అవరోధం కలిగించి బీపీని పెంచుతుంది. 
* తద్వారా పక్షవాతం, గుండెపోటు, కీళ్లవాపులు వచ్చే అవకాశం ఉంటుంది. 
* రుచుల కోసం పాకులాడితే వచ్చే రోగాలను రుచి రోగాలు అంటారు. ఇవి అనర్థదాయకం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు