ఈ రోజులలో చాలామంది తెల్లజుట్టుతో బాధపడుతున్నారు. చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారిని ఈ సమస్య బాధిస్తుంది. దీనికి వంశపారంపర్యం ఒక కారణమైతే, థైరాయిడ్, అధిక వత్తిడి, ఆందోళన, మరొక కారణం. ముఖ్యంగా చిన్నపిల్లలలో పోషకాహార లోపం వల్ల కూడా ఈ సమస్య ఎదురౌతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ఇలా చేయాలి.
1. ఎప్పుడూ ఒకే రకమైన షాంపూలను మాత్రమే వాడాలి.
2. పాలు,గుడ్లు, సోయాబీన్స్, మెులకెత్తిన విత్తనాలు, డ్రై ప్రూట్స్ వంటివి ఎక్కువుగా తీసుకొనటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
4. ఐదు టీస్పూన్ల ఉసిరిపొడి, 2 టీస్పూన్ల గోరింటాకు పొడి, 2 టీస్పూన్ల మిరియాల పొడి, 2 టీస్పూన్ల టీ పొడి, 2 టీ స్పూన్ల నువ్వుల పొడి తీసుకొని దానికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీనిని రాత్రిపూట తయారుచేసి ఉదయానే 5 నిమిషాలపాటు సన్నటి సెగపై వేడి చేయాలి. తర్వాత దానిని తలకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారుతుంది.