మామిడి టెంకను పొడి చేసుకుని జీలకర్ర, మెంతుల పొడితో సమానంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ అన్నంలో కలుపుకుని తీసుకోవడం వలన శరీరంలోని వేడిని తగ్గించుటకు చాలా ఉపయోగపడుతుంది. ఉదరసంబంధ వ్యాధులకు కూడా ఈ మామిడి టెంక మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది.
ఈ టెంక ఉండే ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ జుట్టుకు పోషణనిస్తాయి. వెంట్రుకలను దృఢంగా పెరిగేలా సహాయపడుతాయి. తెల్లజుట్టుకు టెంక పొడిలో కొబ్బరి, ఆలివ్, ఆవ నూనెలు కలుపుకుని జుట్టుకు రాసుకుంటే కురులు నల్లగా మారుతాయి. అంతేకాకుండా ఈ మామిడి టెంక పొడిలో వెన్నను కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.