స్వీట్ కార్న్‌ని దాదాపు పిల్లలైన, పెద్దలైన ఇష్టపడని వారుండరు. లేతగా ఉండే స్వీట్ కార్న్‌ని ఇంట్లో ఉడికించుకున్నా, బయట కొనుక్కుని తిన్నా భలేరుచిగా ఉంటుంది. ఇంకా ఇంకా తినాలనిపించే దానివల్ల కలిగే లాభాలపైన ఓ అవగాహన తెచ్చుకుంటే ఇంకా ఇష్టంగా తినొచ్చు. స్వీట్‌కార్న్‌లో కెలొరీలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే డైటరీ పీచు ఎక్కువ.
3. స్వీట్‌కార్న్ నుంచి థయామిన్, నియాసిన్, ఫోలేట్, రైబోఫ్లేవిన్ లాంటి పోషకాలతో పాటూ జింక్, మెగ్నీషియం, రాగి, ఇనుము, మ్యాంగనీస్ వంటి ఖనిజాల్ని కూడా పొందవచ్చు.
4. స్వీట్ కార్న్ జీర్ణక్రియ పనితీరు వేగంగా ఉండటానికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ గింజల్లో ఉండే బీ12, ఫోలిక్ యాసిడ్ రక్తహీనత సమస్య రాకుండా చూస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. దానివల్ల రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.