సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సజ్జల్లో విటమిన్లు, మినరల్స్ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాంటి సజ్జలతో కొట్టిన పిండితో చేసే వంటకాలు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. పెసలు సజ్జలు కలిపి నానబెట్టి రుబ్బి పెసరట్టు వేసుకొని తిన౦డి. ఆరోగ్యానికీ రుచికీ జీర్ణశక్తికీ ఇది మేలు చేస్తుంది. సజ్జ బూరెలు, సజ్జ గారెలు, సజ్జపాయసం, జావతో చేసిన సూపులు తేలిగ్గా జీర్ణమవుతాయి, ఇంకా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
స్థూలకాయం, పెద్ద బొజ్జ తగ్గాలంటే మొలకెత్తిన సజ్జలను రోజూ అరకప్పు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో సజ్జలతో చేసిన అంబలి, సంగటి ఆరోగ్యానికి శక్తినిస్తుంది. డీహైడ్రేషన్ బారి నుంచి తప్పిస్తుంది. పిల్లలకు సజ్జ రొట్టెలు రోజుకొకటి ఇవ్వడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. సజ్జలతో చేసిన అంబలిని రోజూ ఓ గ్లాసు తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు మధుమేహం దరిచేరదు. సజ్జల పిండితో ఇడ్లీ, దోసెలు కూడా తయారు చేసి తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు.