మునగలో ప్రోటీన్లు పుష్కలంగా వుండటంతో శరీరానికి బలం చేకూరుతుంది. సాధారణంగా మెరిసే చర్మాన్ని పొందాలంటే.. యాంటీ-యాక్సిడెంట్లు, యాంటీ- ఏజింగ్ గుణాలున్న మునగ నూనెను వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మునగ నూనె రక్తాన్ని శుభ్రపరుస్తుంది.
మృదువైన కేశాలు, చర్మం లభిస్తుంది. అంతేగాకుండా మునగ నూనెను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఎ, ఐరన్ వంటి ధాతువులు శరీరానికి లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.