గులాబీపూలు మనిషి మూడ్‌ను మార్చే శక్తిని కలిగి వుంటాయి. ఎంతో విచారంలో ఉన్న వారికి గులాబీలు అందించినట్లయితే వారి మనసులో విచారం పోయి ఆనందం మొదలవుతుంది. గులాబీల నుండి తీసిన రసాయనాలు మానవ కాలేయం, పిత్తాశయాల పనితీరును మెరుగుపరుస్తాయి.
ఇక మల్లెపూవుల విషయానికి వస్తే ఇవి ఘాటైన సువాసనలనిస్తుంటాయి. ఇవి అలంకరణకే కాదు ప్రేమికులు మంచి మూడ్ రావటానికి కూడా ఉపయోగిస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే తలలో చుండ్రు సమస్య అధికంగా ఉంటే మెంతులతోపాటు కాసిని ఎండుమల్లె పూలు కలిపి నూరి తయారైన చూర్ణాన్ని తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. అంతేకాదు జుట్టు కూడా పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.
ఇంకా కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నానబెట్టి ఆ తర్వాత బాగా మరగబెట్టి తలకు పట్టిస్తే కేశాలు ఆరోగ్యవంతమవడమే కాకుండా మాడుకు చల్లదనాన్నిస్తుంది. మల్లెల్ని పేస్టుగా చేసి కొద్దిగా పాలు కలిపి నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముల్తానామట్టి, గంధం, తేనె అరస్పూన్ చొప్పున కలిపి ప్యాక్ వేసుకుని ఆ తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.