కమలా పళ్లు వచ్చేశాయ్... ఈ పండ్లు తింటే ఉపయోగాలేంటో తెలుసా...?!

శుక్రవారం, 7 అక్టోబరు 2016 (17:34 IST)
సిట్రస్‌ జాతికి చెందిన కమలాఫలం, నారింజ, బత్తాయి, నిమ్మ వంటి ఏ ఫలాన్ని అయినా సరే వాడితే విటమిన్‌-సి పుష్కలంగా అందుతుంది. తక్షణమైన ఫలితం కావాలంటే కమల ఫలాల రసంలో కాస్త ఉప్పు లేక పంచదార వేసుకుని తాగితే నిస్సత్తువపోతుంది. 
 
అంతేకాదు తరచుగా జలుబుతో బాధపడేవారు కమలాఫలాన్ని తరచు వాడుతూ ఉంటే వారికి రోగనిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుతుంది. కామెర్ల రోగం వచ్చిన వారు పులుపు తినకూడదు అంటారు. కానీ కమలా ఫలాలలో దేనినైనా సరే రసం తీసి పంచదార కలుపుకుని తరుచు త్రాగుతుంటే కామెర్లు త్వరగా తగ్గిపోతాయి.
 
నారింజ, కమలాఫలాల తొక్కలు కూడా ఉపయోగపడతాయి. ఈ తొక్కలను పారెయ్యకుండా ఎండలో బాగా ఎండబెట్టి ఆ తరువాత పాడిచేసి ఆ పొడిని వేడినీళ్లలో కలిపి స్నానంచేస్తే శరీరం తాజాగా సువాసనలు వెదజల్లుతోంది. చర్మవ్యాదులు కూడా తొలగిపోతాయి. ఎంతకూ మానని పుళ్ళు ఉన్న సంధర్భంలో తరచుగా కమలాఫలం తింటే పుళ్ళు త్వరగా మానిపోతాయి.
 
కమలాఫలం రోజుకు ఒకటి రాత్రి పడుకోబోయే ముందు తింటే ఉదయానికి సుఖ విరేచనం అవుతుంది. మలబద్థకం అలవాటుగా మారినవారు ఈ విధంగా చేస్తే ఉపయోగం ఉంటుంది. కమలాఫలం తరచుగా వాడటం వల్ల పంటిచిగుళ్ళ నుంచి రక్తం కారడం తగ్గుతుంది. కమలాఫలం విటమిన్‌ సి మాత్రమే కాక కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజ లవణాలు కూడా ఉన్నాయి. 0.8గ్రాముల ప్రోటీన్లు, 0.3గ్రాముల కొవ్వు పదార్థాలు ఉన్నాయి. వీటితో పాటుగా 9గ్రాముల పిండి పదార్థాలు కూడా ఉన్నాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. ఇది పైత్యాన్ని అరికడుతుంది.జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. చలువ చేస్తుంది. దాహమును అరికడుతుంది.

వెబ్దునియా పై చదవండి