ఎత్తైన తలదిండ్లు వాడితే ఆరోగ్యానికి కలిగే హాని ఏంటి?

శనివారం, 18 మార్చి 2017 (13:28 IST)
చాలా మందికి తలకింద దిండు లేనిదే నిద్రపట్టదు. ఇలాంటి వారు ఆ సమయానికి ఏదో ఒకటి ఎత్తును తల కింద పెట్టుకుని నిద్రకు ఉపక్రమిస్తుంటారు. అలాంటి వారు చిన్నపాటి అనారోగ్య ఇబ్బందులకు గురవుతుంటారు. అందువల్ల దిండ్లను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. తలదిండ్లు మరీ పలుచగా ఉన్నా.. మరీ ఎత్తుగా ఉన్న వెన్నుముకకి ఇబ్బంది కలుగుతుంది. 
 
మరీ పల్చగా ఉన్న దిండ్లను వాడినా.. లేదంటే బాగా ఎత్తైన దిండ్లని ఎంచుకున్నా... వీటివల్ల వెన్నెముకకి ఇబ్బంది. దీర్ఘకాలం ఇలానే పడుకుంటే వెన్నెముక, మెడపై భారం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అంతేకాకుండా, వెల్లకిలా, బోర్లా ఈ రెండూ నిద్రపోవడానికి సరైన విధానాలు కావు.. ఒక పక్కకు ఒత్తిగిలి పడుకోవడం మంచి పద్ధతి. బరువుని ఎత్తేటప్పుడు వంగిపోయి అమాంతం ఎత్తడం కూడా మనలో చాలామంది చేసేదే. దీనివల్ల నడుము పట్టేస్తుంది. అలా కాకుండా మోకాళ్ల మీద కూర్చుని నిదానంగా, అదును చూసుకుని ఎత్తాలి.

వెబ్దునియా పై చదవండి