గసగసాలు అతిగా వాడితే పురుషులకు ఏమవుతుందో తెలుసా...?

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (19:09 IST)
మసాలా దినుసుల్లో ముఖ్యమైనవి గసగసాలు. వీటినే గసాలు అని కూడా అంటారు. గసగసాలు నుండి నల్ల మందును తయారుచేస్తారు. నల్లమందు ఆరోగ్యానికి హానికరమని మనకు తెలుసు. గసగసాలను కేవలం ఔషధంగా అప్పుడప్పుడు వాడుకోవడం మంచిది. వీటిని ప్రాచీన కాలం నుండే ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల జరిగే మేలేంటో తెలుసుకుందాం.
 
1. గుండె సమస్య ఉన్న వారు గసగసాలు దోరగా వేయించి పంచదార కలిపి ఉదయం, సాయంత్రం అర చెంచాడు తీసుకుంటే గుండెకు మంచిది. కడుపులో మంట ఉన్న వారు ఎసిడిటీ వున్న వారు దీనిని వాడితే పేగులలోని పుండు కూడా తగ్గుతుంది.
 
2. గసగసాలు చలువ చేసే గుణాన్ని కలిగి వుంటాయి. తరచు వేడి చేసేవారు వీటిని వాడటం వలన వేడి తగ్గుతుంది. విరేచనాలు అవుతున్నప్పుడు గసగసాలను దోరగా వేయించి నీటితో కలిపి నూరి ఆ రసాన్ని తేనెతో గాని లేక పంచదారతో కాని తీసుకోవాలి.
 
3. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వలన మంచి నిద్ర సొంతం అవుతుంది. గసగసాలు ఎక్స్పోక్టోరెంట్ మరియు సిమల్సేంట్ గుణాలను కలిగి ఉన్నందువలన శ్వాస సంబంధిత రుగ్మతలు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా దగ్గు మరియు దీర్ఘకాలిక ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తాయి.
 
4. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ళ ఏర్పాటును నివారించే శక్తిని గసగసాలు కలిగి ఉంటాయి. వీటిలో ఉండే ఆక్సలేట్లు శరీరంలో అదనంగా కాల్షియంను గ్రహించి మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడకుండా నిరోధిస్తాయి. 
 
5. గసగసాలు అతిగా వాడటం వలన మగవారిలో వీర్య నష్టము జరుగుతుంది. లైంగిక సామర్థ్యం కూడా దెబ్బ తింటుంది. కాబట్టి వీటిని అతిగా వాడకూడదు. ఔషధంలా వాడుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు