వీరివీరి గుమ్మడి పండు... ఇందులో ఔషధాలెన్ని...?

బుధవారం, 24 ఆగస్టు 2016 (17:46 IST)
నెలలతరబడి ఓ తీగకు వేలాడే గుమ్మడిలో అద్భుత ఔషధాలున్నాయి. ఇది చాలామందికి తెలియదు. గుమ్మడి కాయకు భారత సంప్రదాయక వంటకాలలో మంచి స్థానమే ఉంది. ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండటం విశేషం. 
 
మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకూ పలు విధాలుగా ఉపయోగపడే గుమ్మడిని చైనాలో చక్కెర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో వాడుతున్నారు. 
 
గుమ్మడి ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా సరిపోతుంది. గుమ్మడి విత్తనాలు తినడం వలన మలబద్ధకం నివారణ ఆవుతుంది. ఆహారం పూర్తిగా జీర్ణమై మలబద్ధక సమస్య తీరుతుంది. తరచూ గుమ్మడిని తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. పైగా గింజల నుంచి తీసే నూనెను వాడటం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి