TNR, Mahadev, Anupama Prakash, Deepthi Srirangam
టి. నరసింహా రెడ్డి (టీఎన్ఆర్) నటిస్తూ, నిర్మించిన చిత్రం మిస్టర్ రెడ్డి. ఈ చిత్రానికి వెంకట్ వోలాద్రి దర్శకత్వం వహించారు. మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూలై 18న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నాడు నిర్వహించారు.