అసలే కరోనావైరస్, దోమలు కూడా తోడైతే.. ఈ చిట్కాలు పాటించండి

శనివారం, 24 అక్టోబరు 2020 (21:33 IST)
ఒకవైపు కరోనావైరస్ విజృంభిస్తోంది. మరోవైపు వర్షాకాలం కనుక సీజనల్ వ్యాధులు చుట్టుముట్టే అవకాశాలు ఎక్కువ. ఇంటి చుట్టుప్రక్కల నీరు నిలుస్తున్నట్లుయితే దోమలు ఎక్కువగా వచ్చి చేరుతాయి. నీటివల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, ఎన్‌సెఫలైటిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవచ్చు.
 
1. ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలి. ఎక్కడైనా నీరు నిలిచి ఉంటే అందులో గంబూసియా చేపలను వదలాలి. ఈ చేపలు దోమల గుడ్లను తినేస్తాయి.
 
2. ఎక్కువ రోజులు నీరు నిలిచి ఉన్నట్లుయితే కొంచెం కిరోసిన్ చల్లాలి.
 
3. ఇప్పుడు కూలర్‌ను అవసరం ఉండదు కాబట్టి అందులో నీరు లేకుండా చేసి శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి.
 
4. పూల కుండీల దగ్గర, గార్డెన్‌లో మొక్కల దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి.
 
5. ఇంటి మేడపైన, మెట్ల కింద పనికిరాని టిన్‌లు, టైర్లు ఉంటే తొలగించాలి.
 
6. వాటర్ టాంక్‌ను, సంప్‌ను శుభ్రపరచుకొంటే క్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి.
 
7. డ్రైనీజిలో నీరు సాఫీగా వెళ్లేలా చూసుకోవాలి. పైపులు లీకేజీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
 
8. వాటర్ టాంక్‌పైన మూత తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
 
9. కిటికీలకు సన్నటి తెరలు బిగించుకోవాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు