గుండె జబ్బులను అడ్డుకునే బాదములు, ఎన్ని తినాలో తెలుసా?

మంగళవారం, 6 అక్టోబరు 2020 (17:30 IST)
ఇటీవలే టుఫ్ట్స్‌ యూనివర్శిటీ చేసిన అధ్యయనంలో, యుఎస్‌ వినియోగదారులలో బాదములను అసలే తినని వారితో పోలిస్తే ప్రతి రోజూ 42.5 గ్రాముల బాదములను తీసుకోవడం ద్వారా కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులకు సంబంధించిన ఆరోగ్య సంరక్షణ ఖర్చులు తగ్గించేందుకు సహాయపడుతుందని తేలింది. ఈ అధ్యయనానికి అల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా నిధులను సమకూర్చింది.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు (సీవీడీ) ప్రపంచవ్యాప్తంగా మాత్రమే కాదు భారతదేశంలో కూడా మరణాలకు అతిపెద్ద కారణంగా నిలుస్తుంది. చికిత్స పరంగా అతి ఖరీదైన వ్యాధి కూడా సీవీడీ మరియు రోగులు, వారి కుటుంబ సభ్యులపై అధికంగా ఆర్ధిక భారం కలిగిస్తుంది. భారతదేశం వరకూ చూస్తే, సీవీడీలు అత్యంత ఆందోళనకరమైన అంశంగా మారుతున్నాయి.
 
ఈ వ్యాధి వేగవంతంగా వ్యాప్తి చెందుతుండటం, చిన్న వయసులోనే ఈ వ్యాధి బారిన పడుతుండటం, అత్యధిక మరణాల రేటు కూడా దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి. భారతదేశ వ్యాప్తంగా సీవీడీ కేసులు గణనీయంగా వృద్ధి చెందుతుండటానికి గల కొన్ని కారణాలను పరిశీలిస్తే దక్షిణాసియా జన్యు నిర్మాణం, ఈ వ్యాధుల బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉండటం, నిత్యం మారుతున్న జీవనశైలి, వ్యాయామాలు చేయకపోవడం, సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, శాచురేటెడ్‌ మరియు ట్రాన్స్‌ఫ్యాట్స్‌ వంటివి అధికంగా తీసుకోవడం వంటివి కనిపిస్తున్నాయి. గతంలో పలు అధ్యయనాలు వెల్లడించిన దాని ప్రకారం రోజూ బాదములు తీసుకోవడం వల్ల లోడెన్సిటీ లిపోప్రోటీన్‌ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ స్థాయిలు గణనీయంగా తగ్గుతున్నాయి. భారతీయులలో సీవీడీ ప్రమాదానికి అతి ముఖ్యమైన కారణంగా ఈ ఎల్‌డీఎల్‌ను పరిగణిస్తున్నారు.
 
ఈ అధ్యయనం ముఖ్య ఉద్దేశ్యం, బాదముల వినియోగం ద్వారా ఎంతమేరకు ఖర్చు తగ్గుతుంది? ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలలో మార్పులను చూడటం ద్వారా కొరొనరీ హార్ట్‌ డిసీజెస్‌ నివారించడం ఎంత మేరకు యుఎస్‌ ప్రజలలో తోడ్పడుతుందని గమనించారు. స్వల్పకాలిక కేస్‌ విశ్లేషణలతో పాటుగా 10 సంవత్సరాల ప్రమాద నివారణను దీని కోసం వినియోగించారు. ఈ అధ్యయన పరిశోధకులు ఓ ప్రత్యేక నమూనాను అభివృద్ధి చేయడం ద్వారా ప్రతి రోజూ 42.5 గ్రాముల బాదములను తినడంతో అసలు బాదములను తీసుకోని వారిని సరిపోల్చారు. 

సీవీడీ పారామీటర్లలో ఎల్‌డీఎల్‌స్ధాయిలు వృద్ధి చెందే అవకాశాలు, అక్యూట్‌ మియోకార్డియల్‌ ఇన్‌ఫ్రాక్షన్‌ (ఎంఐ లేదా హార్ట్‌ ఎటాక్‌) అభివృద్ధి, ఎంఐ సంబంధిత శస్త్రచికిత్సలు, ఈ వ్యాధి కారణంగా మరణాలు, శస్త్ర చికిత్సలు, ఈ వ్యాధి యొక్క ఖర్చు 2012లో యుఎస్‌ ప్రజల నడుమ ప్రక్రియలు ఉన్నాయి. ఈ అధ్యయనంలో వినియోగించిన బాదముల యొక్క ఖర్చును 2012లో యుఎస్‌ మార్కెట్‌లో ఉన్న ధర ఆధారంగా తీసుకున్నారు.
 
ఈ అధ్యయనంలో వినియోగించిన బేస్-కేస్‌ మోడల్‌, టైప్‌ 2 మధుమేహంతో అత్యధిక ప్రమాదం కలిగిన 150 మంది యుఎస్‌ అడల్ట్స్‌ను వినియోగించారు. ప్రతి రోజూ 42.5 గ్రాముల బాదములను తినడం ద్వారా బాదములను అసలు తీసుకోని వారితో పోలిస్తే ప్రతి సంవత్సరం చికిత్స ఖర్చుపై 363 డాలర్లు ఆదా చేయగలిగారు. బాదములను తినే వారిలో సీవీడీ ప్రమాదకారకాలు తగ్గాయి.
 
వీటిలో ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌, టోటల్‌ కొలెస్ట్రాల్‌, బాడీ వెయిట్‌, అపోలిప్రోటీన్‌ బీ (దీనినే అపో-బీ, హానికారక ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌‌లో ప్రధానంగా కనిపించే ప్రొటీన్‌) వంటివి ఉన్నాయి. ఈ మెరుగైన పారామీటర్లు సీవీడీ చికిత్సలో ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించాయి.
 
ఈ అధ్యయనం గురించి రీజనల్‌ హెడ్-డైటెటిక్స్‌, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌- ఢిల్లీ, రితికా సమద్ధార్‌ మాట్లాడుతూ, ‘‘ఈ అధ్యయనంలో బాదములను ఆరగించడం, గుండె ఆరోగ్యం, వీటి ద్వారా చేకూరే ఖర్చు ప్రయోజనాల నడమ సంబంధాన్ని చక్కగా వివరించారు. భారతదేశం లాంటి దేశాలలో ఈ అంశాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం సీవీడీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
 
బాదముల వల్ల గుండె ఆరోగ్య ప్రయోజనాలను గతంలో పలు అధ్యయనాలు విశ్లేషించాయి. ఈ నూతన అధ్యయనంలో సైతం దీర్ఘకాలిక ఖర్చు ప్రయోజనాలను బాదములు ఆరగించడం వల్ల వెల్లడించడం వినూత్న అంశం. అందువల్ల, మీ కుటుంబ మరియు మీ డైట్‌లో బాదములను జోడించుకోండి. ఇది ఆరోగ్యవంతమైన మరియు అత్యంత ప్రభావవంతమైన జీవనశైలిగా నిలుస్తుంది’’ అని అన్నారు.
పదేళ్ల కాలానికి ఈ అధ్యయన కాలాన్ని విస్తరించినప్పటికీ, అధ్యయన ఫలితాలు అదే రీతిలో ఉంటాయి: బాదములు తినని వారికి సీవీడీ నివారణ కోసం 2566 డాలర్లు ఖర్చు అయితే బాదములను తినేవారికి ఆ ఖర్చు కేవలం 1806 డాలర్లు మాత్రమే. తద్వారా 706 డాలర్లు ఆదా అవుతుంది.
 
ఈ అధ్యయనం గురించి షీలా కృష్ణస్వామి, న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ మాట్లాడుతూ, ‘‘ఈ అధ్యయన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. భారతీయుల జన్యు నిర్మాణం, నిశ్చల జీవనశైలి, సరికానటువంటి ఆహార అలవాట్లు, అధికంగా ఉప్పు తీసుకోవడం వంటివి గుండె వ్యాధులకు కారణంగా నిలుస్తున్నాయి. ఒకరికి ఈ వ్యాధి వచ్చినట్లయితే అది కుటుంబ వైద్య ఖర్చులను గణనీయంగా పెంచుతుంది.
 
అందువల్ల, నేను సూచించేదేమిటంటే సీవీడీ చరిత్ర కుటుంబంలో ఉంటే లేదంటే అధిక బీపీ, మధుమేహం, ఊబకాయం లాంటి సమస్యలు కలిగి గుండె వ్యాధుల ప్రమాదం ఉంటే వారు తమ డైట్స్‌ మార్చుకోవాలి. తమ రోజువారీ ఆహారంలో బాదములను ఇతర ఆహార పదార్థాలతో పాటుగా జోడించుకోవాలి. సుదీర్ఘకాలంలో, మీ జీవనశైలి మార్చుకోవడం ద్వారా సానుకూల ప్రభావం మీ గుండె ఆరోగ్యంపై మాత్రమే కాదు, మొత్తంమ్మీద వైద్య ఖర్చులను సైతం గణనీయంగా తగ్గిస్తుంది’’ అని అన్నారు.
 
ఈ విశ్లేషణలపై ఆధారపడి, అధ్యయనకారులు ప్రతి రోజూ 42.5 గ్రాముల బాదములను తీసుకోవడం వల్ల సీవీడీని స్వల్పకాలంలో తగ్గించడంతో పాటుగా దాదాపు 10 సంవత్సరాల వరకూ దీనిని నివారించడానికి ప్రభావవంతమైన ఖర్చుతో కూడిన వ్యవహారంగా నిర్థారించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు