రక్తం తాగితే దోమల పొట్ట పగులుతుంది.. కానీ వాటికి ఏమీ కావు (Video)

శనివారం, 3 అక్టోబరు 2020 (14:16 IST)
mosquitoes
రక్తం తాగడం దోమల అలవాటు. మగ దోమలు మొక్కల రసాన్ని పీల్చుకుని బతుకుంటాయి. మనుషుల రక్తాన్ని ఆడ దోమలు పిప్పి చేస్తాయి. అవి కుడుతున్నప్పుడు రక్తం అంతా తాగేస్తుంటాయి. ఇలా తాగేస్తే దోమల పొట్ట పగలాలని తిట్టుకునే వారు ఎంతోమంది వుంటారు. కానీ దోమల పొట్ట పగలడం మాత్రం ఎప్పుడూ చూడలేదు. మన తిట్లు ఒక్కోసారి నిజమవుతాయి. 
 
ఎలా అంటారా? దోమలు అధికంగా మనిషి రక్తం తాగిడం వల్ల వాటి పొట్ట నిజంగానే పగులుతుంది. దీనివల్ల వాటికేం ప్రమాదం జరగదు. ఈ మాటలు చెబితే నమ్మాలనిపించదు. అందుకే వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోను పెర్రన్ రాస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అయింది. దీనిని ఇప్పటి వరకు 115.8కే మంది వీక్షించారు. ఇంకా లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. 

By popular demand, here's a shorter version of the exploding mosquitoes video pic.twitter.com/nRMiycFKqH

— Perran Ross (@MosWhisperer) March 24, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు