ప్రస్తుత పరిస్ధితుల్లో జీవితం ఉరుకుల పరుగులమయంగా మారింది. ఇప్పుడున్న సమస్యలు శరీరంపై, మెదడుపై ఎంతో ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఓపికను పరీక్షించే ట్రాఫిక్, ఆరోగ్యంతో ఆడుకునే కాలుష్యం, ఆఫీస్‌లో డెడ్‌లైన్‌లు ఇలా ప్రతిదీ మన ఒత్తిడిని పెంచేసేవే. కొన్ని రకాల పదార్థాలను రోజువారి ఆహారంలో తీసుకోవటం వల్ల ఈ ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. అవి ఏమిటంటే...
3. పాలు...వీటిలో యాంటీ ఆక్సిడెంట్లూ, బి2, బి12 విటమిన్లు, మాంసకృత్తులూ, క్యాల్షియం ఎక్కువ మెుత్తంలో ఉంటాయి. పాలలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దాంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతారు. కనుక ప్రతిరోజూ గ్లాసుడు పాలు తప్పనిసరిగా త్రాగటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.