అక్షయ తృతీయ నాడు పేదలకు చెప్పులను దానం చేస్తే?

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (13:30 IST)
అక్షయ తృతీయ నాడు పాదరక్షలను పేదలకు దానం చేయడం ద్వారా నరకబాధలుండవు. అక్షయ తృతీయనాడు నారికేళాన్ని దానం చేయడం ద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది. తమలపాకులను దానం చేయడం వలన ఉద్యోగాలలో పదోన్నతులు, వ్యాపారలాభాలుంటాయి. అక్షయ తృతీయనాడు కుంకుమ దానం చేయడం వలన ఆ ఇల్లాలి సౌభాగ్యం అక్షయమై వెలుగొందుతుంది. దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది.
 
అలాగే అక్షయ తృతీయ రోజు చేయవలసిన దానాలలో ఉదకుంభ దానం విశిష్టమైంది. రాగి లేదా వెండి కలశంలో కుంకుమపువ్వు, కర్పూరం, తులసి, వక్క కలిపిన నీటిని దానం చేస్తే వివాహ అడ్డంకులు తొలిగిపోయి.. శ్రీఘ్రవివాహం.. పిల్లలు లేనివారికి సంతాన ప్రాప్తి చేకూరుతుంది. చందన దానం చేస్తే ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. పరుపులు దానం చేస్తే సంతోషం చేకూరుతుంది. 
 
అయితే అక్షయ తృతీయ శ్రీమహావిష్ణువుకు, శ్రీమహాలక్ష్మికి ప్రీతిపాత్రం కావడంతో ఆ రోజున ఎలాంటి పాపకార్యాలు చేయకూడదు. అలాగే శక్తి కొలది దానం చేయాలి. ఎవరిమీదకూడా కోపం, ద్వేషం చూపించరాదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు