కెలోరీలు తగ్గాలంటే దాల్చిన చెక్కను వాడాలి. దాల్చిన చెక్కను వాడటం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. తద్వారా శరీర బరువు కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే రోజు తినే పెరుగు లేదా తృణధాన్యాల్లో పావు స్పూన్ దాల్చినచెక్క పొడిని వేస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినవారవుతారు. రోజుకు మూడు సార్లు గ్రీన్ టీ తాగడం ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
పచ్చిమిర్చిలోని కాప్ సైసిన్ అనే పదార్థం శరీర ఉష్ణోగ్రతను దానితోపాటు జీవక్రియను పెంచుతుంది. దీని ఫలితంగా శరీరంలోని కేలరీలు కరుగుతాయి. వీటితో పాటు చేపలు, చికెన్, టోఫు వంటి వాటిల్లో ప్రొటీన్లు బాగా ఉంటాయి. ఇవి అరిగించుకోవడం కొంత కష్టమే కానీ నిత్యం ప్రొటీన్లున్న ఆహారం తీసుకోవడం ద్వారా జీవక్రియ మెరుగుపడుతుంది. తద్వారా కేలోరీలు కరిగి.. స్లిమ్‌గా తయారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.