వింటర్‌లో సూర్యరశ్మితో కలిగే మేలెంతో తెలుసా?

గురువారం, 19 జనవరి 2017 (20:04 IST)
ఎండాకాలమైనా, వానాకాలమైనా, శీతాకాలమైనా ఏకాలంలో అయినా సూర్యరశ్మి ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే శరీరానికి కావలసిన విటమిన్‌ డి, కాల్షియం దీని నుంచే అందుతుంది కాబట్టి. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. దాంతో కొంత ఉపశమనం కోసం సూర్యరశ్మిని కోరుకుంటాం. 
 
సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యరశ్మిలో ఉండటం, సూర్యాస్తమయం సమయంలో సూర్యరశ్మిలో ఉండటం వల్ల ఎముకల పటుత్వానికి ఉపయోగపడే కాల్షియం, విటమిన్‌ డి శరీరానికి అందుతాయి. దీనివల్ల శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఎండలో ఉండటం ఎందుకు అనుకోకుండా ఉదయం, సాయంత్రం సూర్యరశ్మిని పొందడం మంచిది. 
 
సూర్యరశ్మి తక్కువగా సోకే వారిపై.. అంటే సూర్యకాంతి శరీరంపై చాలా తక్కువ పడే వారికి లుకేమియా వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు తేల్చాయి. సూర్యరశ్మి శరీరంపై తక్కువగా పడడం, అల్ట్రావైలెట్‌ బీ రేడియేషన్‌ ఎక్స్‌పోజర్‌, విటమిన్‌ డీ లెవల్స్‌ తగ్గడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. 

వెబ్దునియా పై చదవండి