సాధారణంగా మనం రకరకాల దుంపలను తింటూ ఉంటాం. వీటిలో చిలకడదుంప చాలా ప్రధానమైనది. చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. సలాడ్లకూ ఇవి మరింత రుచిని తెచ్చిపెడతాయి. కాబట్టి వీటిని వారానికి కనీసం రెండు సార్లయినా తినటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.
5. పిండి పదార్థాల జీవక్రియల్లో చాలా కీలమైన మాంగనీసు కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి. వీటిల్లోని విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచితే.. విటమిన్ ఈ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది.