రాత్రిపడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు ఉన్న మట్టి, సూక్ష్మజీవులుపోయి కాలు శుభ్రపడి పాదాలకు వచ్చే ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసుకోవచ్చు. అయితే వేళ్లమధ్యలో ఉన్న తేమను గుడ్డతో తుడుచుకుని, తడి ఆరిన తరువాతే పడుకోవాలి. అలాకాని పక్షంలో వేళ్ల మధ్యలో ఫంగస్, అంటువ్యాధులు సోకే అవకాశముంది.
మనం వాడే బూట్లకు రోజు మార్చి రోజు సెలవు ఇవ్వాలి. అంటే ఒకరోజు వాడి రెండో రోజు వాడకపోవడం. బూటులోపల తడి ఆరడానికి ఈ సెలవు పనిచేస్తుంది. తడిఆరని బూట్లు, సాక్సుల వల్ల పాదానికి ఫంగల్ అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. రోజూ సాక్స్‌ను మార్చాలి. ఒకేసాక్సు ఎక్కువ రోజులు వాడకూడదు.