ఎర్ర అరటిపండు తింటే ఏంటి ప్రయోజనం?

మంగళవారం, 21 డిశెంబరు 2021 (19:53 IST)
ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు అవసరం. ఒక చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి. విటమిన్ సి మీ రోగనిరోధక వ్యవస్థ కణాలను బలోపేతం చేయడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
 
ఎర్ర అరటిపండుతో ప్రయోజనాలు
కిడ్నీలకు మేలు చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో ఇందులో వుండే పొటాషియం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
 
రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. ఈ పండులో విటమిన్ సి, బి6 వున్న కారణంగా మన రోగనిరోధక వ్యవస్థ బలంగా వుంటుంది.
 
చర్మానికి మంచిది. అలాగే రక్తాన్ని శుభ్రపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శక్తి స్థాయిని పెంచడమే కాకుండా రక్తహీనతను నివారిస్తుంది. కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు