ముల్లంగిలో విటమిన్లు ఎ, బి, సి, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ వంటి అనేక ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు గొప్ప కూరగాయ అని పిలుస్తారు. ఐతే ముల్లంగితో కలిపి కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాము.
దోసకాయ, ముల్లంగిని కలిపి తినకూడదు, ఎందుకంటే దోసకాయలో వుండే ఆస్కార్బేట్, విటమిన్ సిని పీల్చుకునేలా చేస్తుంది.
ముల్లంగితో పాటు నారింజను తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ముల్లంగితో కలిపి కాకరను తీసుకుంటే ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి.