తయారీ విధానం: ముందుగా ఓ బౌల్‌లో గోధుమ పిండి, ముల్లంగి తురుము, ఉప్పు, కారం, వెల్లుల్లి ముద్ద, జీలకర్ర పిండిని కలుపుకోవాలి. సహజంగా నీరు ముల్లంగిలో వుంటుంది కాబట్టి .. నీళ్లు కాసింత పోసి కలుపుకోవాలి. పావు గంట ఈ మిశ్రమాన్ని పక్కనబెట్టాలి. ఆ తర్వాత చపాతీల్లా వేసుకుని పెనంపై నేతితో కాల్చుకోవాలి. అంతే ముల్లంగి చపాతీ రెడీ. వీటిని వేడి వేడిగా గ్రీన్ చట్నీ, టమోటా సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.