మనిషి శరీరంలో నుండి ఒక రోజులో 700 నుండి 1000 గ్రాముల నీరు చెమట రూపంలో బయటకు పోతుంటుంది. అదే సమయంలో శరీరంలోపల 300 నుండి 400 గ్రాముల నీరు తయారవుతూ ఉంటుంది. అంటే మన శరీరంలో బయటకుపోయే నీరు శాతమే ఎక్కువ. ఇలా నీటి శాతం తగ్గినప్పుడు దాహం వేస్తుంది. రక్తంలో ఉప్పు, నీరు కలిసి ఉంటాయి.
మమూలుగా ఇవి రెండు రక్తంలో స్థిరంగానే ఉంటాయి. ఏ కారణం చేతనయినా రక్తంలో నీటి శాతం తగ్గినట్లైతే దాహం వేస్తుంది. కొందరికైతే వేసవికాలం, వర్షాకాలం అనే తేడాలు లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు దాహం వేస్తుంటుంది. వారికి ఎన్ని నీళ్లు త్రాగినా దాహం తీరదు. ఎటువంటి వారికైనా దాహం వేస్తుంటే గ్లాసు చల్లని నీటిలో 4 స్పూన్ల చక్కెర, నిమ్మరసం కలుపుకుని త్రాగితే వెంటనే దాహం తగ్గుతుంది.