కొబ్బరిబొండాం, మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకోవడం వలన శరీరానికి మేలు చేస్తాయి. పండ్లను రసాల ద్వారా తీసుకోకుండా అలాగే తినడం మంచిది. తద్వారా ఆరోగ్యం రెట్టింపవుతుంది.
ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్నానం చేయాలి. వారంలో రెండు రోజులు తలంటు స్నానం చేయాలి. రోజు మార్చి రోజు రాత్రిపూట మెంతుల్ని నానబెట్టి ఉదయం పూట పేస్టులా చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. కొందరికి కొబ్బరి బొండాం, మజ్జిగ తాగితే జలుబు చేస్తుంది. అలాంటి వారు అందులో చిటికెడు మిరియాల పొడిని చేర్చి తీసుకుంటే జలుబు ఉండదు.
ముల్లంగి, క్యారెట్, బీట్‌రూట్, కీరదోస, అరటికాడ, గుమ్మడి, పొట్లకాయ వంటి కూరగాయలను సలాడ్ల రూపంలో తీసుకోవాలి. సలాడ్లలో ఉప్పు, మిరియాల పొడి చిటికెడు చేర్చుకోవచ్చును. వేసవిలో వేడి ఎక్కువైతే జీలకర్ర, మెంతుల పొడిని మజ్జిగలో కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఉదయం పూట రాగి, సజ్జలు, మొక్కజొన్న, గోధుమ, బార్లీ పిండితో తయారైన జావను తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.