పాదాల్లో దుర్వాసన రావటానికి చెమటే కారణం. రోజు మంచి పరిశుభ్రమైన పద్ధతులను పాటించటం ద్వారా ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. పాదాలలో వచ్చే చెమట వలన వెలువడే వాసన రాకుండా ఉండాలంటే, శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. రోజు పాదాలను సబ్బు నీటితో కడగండి. కడిగిన తరువాత తడిపోయే వరకు అలాగే ఉండాలి. మీ పాదాల వచ్చే చెమట వలన వాసన వెలువడకుండా ఉండాలంటే యాంటీ బాక్టీరియల్ ద్రావణంలో పాదాలను నానబెట్టండి.
షూ.. సాక్స్ తొడిగే ముందు ఫుట్ అబ్సార్బెంట్ పౌడర్‌ను పాదాలకు అద్దండి. అరికాళ్ళకు యాంటీ పర్స్పరెంట్ స్ప్రేను వాడటం వలన పాదాల నుండి వచ్చే వాసన రాకుండా జాగ్రత్త పడవచ్చు. పాదాలలో చెమట రాకుండా ఉండాలంటే ఒకే షూను క్రమంగా ధరించకండి. ఒకసారి షూ వేసుకున్న తరువాత అవి ఎండే వరకు వేచి ఉన్న తరువాత ధరించటం వలన వాసన రాకుండా జాగ్రత్త పడవచ్చు.
ముఖ్యంగా, ప్లాస్టిక్ రబ్బరుతో చేసిన కృత్రిమ పదార్థాలతో చేసిన పాదరక్షలు చెమటను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. పొడిగా, గాలి చొరబడేలా ఉండే షూతో పాటూ శుభ్రంగా పొడిగా ఉండే సాక్స్‌లను ధరించటం కూడా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.