కొన్ని రుగ్మతల నివారణలో కొన్ని రకాల పండ్లు ఇతోధికంగా మేలు చేస్తాయి. ఏ రకం పండ్లు ఎలాంటి మేలు చేస్తాయో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. గుండెను పరిరక్షించుకోవాలంటే.. ద్రాక్ష పండ్లను తీసుకోవాలి. ద్రాక్ష, లిచీ పండ్లలో గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే పాలిపినాల్స్ అధికంగా ఉంటాయి. క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టడంలో పాలిఫినాల్స్ బాగా పనిచేస్తాయి.
బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే లిచీలు ఉపయుక్తమైనవి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి, పుచ్చపండ్లలో బీటా క్రిపొక్సాంథిన్ గుణాలు ఎక్కువగా వుంటాయి. ఇవి లంగ్ క్యాన్సర్ నుంచి కాపాడతాయి. ఇతర రకాల క్యాన్సర్ల నుంచి కాపాడే లికోపెన్లు లభిస్తాయి.
విటమిన్ సి అధికంగా వుండే పండ్లు తినే మహిళల్లో చర్మంపై ముడతలు వచ్చే అవకాశాలు మిగతావారికంటే తక్కువగా వుంటాయి. బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి కూడా లభిస్తుంది. రక్తపోటును తగ్గించగల పొటాషియం అత్తి, అరటిపండ్లలో లభిస్తుంది.
కొలెస్ట్రాల్‌ను తగ్గించగల పీచుపదార్థం గంగ రేగు పళ్ళలో, యాపిల్స్‌లో ఎక్కువగా లభించగలవు. రోజుకు అవసరమైన పీచులో నలభై శాతం ఈ పండ్ల నుంచి లభిస్తుంది. పీచుపదార్థాలు ఎక్కువగా తినేవారిలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటాయి.