వామ్మో.... మోటార్ బైక్ సీటు కింద నాగుపాము (video)

ఐవీఆర్

మంగళవారం, 28 అక్టోబరు 2025 (15:47 IST)
అసలే వాన కాలం కావడంతో పాములు కూడా బొరియల నుంచి బైటకు వచ్చేస్తున్నాయి. ఇవి కొన్నిసార్లు వాహనాలలోకి చొరబడుతున్నాయి. ఇలాంటి ఘటన అనకాపల్లిలోని పాయకరావు పేటలో జరిగింది. పాయకరావు పేట పోలీసు స్టేషనుకి విధులకు వెళ్లేందుకు కానిస్టేబుల్ శివాజీ ఎప్పటిలాగే బైకును తీసి నడుపుకుంటూ వెళ్తున్నాడు.

ఐతే మార్గమధ్యంలో వాహనం నుంచి ఏదో వింత శబ్దం రావడం గమనించాడు. అదేమిటా అని బైకు కిందకు దిగి సీట్ ఓపెన్ చేసి చూసిన అతడు షాక్ తిన్నాడు. సీటు తీయగానే నాగుపాము పడగవిప్పి బుసలు కొట్టింది. దీనితో జడుసుకున్న శివాజీ స్థానికులను పిలిచాడు. అంతా అప్రమత్తమై ఆ పామును బైకు నుంచి తరిమేసారు.

బైక్ సీటు కింద నాగుపాము

అనకాపల్లి(D) పాయకరావుపేటకు చెందిన కానిస్టేబుల్ శివాజీ ఎప్పటిలాగే బైకుపై PSకు బయల్దేరారు. మార్గమధ్యలో వాహనం నుంచి ఏదో వింత శబ్దం వినిపించింది. ఏంటా అని బైక్ దిగి సీటు తెరిచి చూడగా అవాక్కయ్యే సీన్ కనిపించింది. సీటు కింది నుంచి నాగుపాము పడగ విప్పి బుసలు… pic.twitter.com/7d3NwtGF1F

— ChotaNews App (@ChotaNewsApp) October 28, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు