శరీరంలో తగిన మోతాదులో రక్తం లేకపోతే నీరసంగా ఉంటుంది. ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకుంటే రక్తం ఉత్పత్తి అవుతుంది. రక్త సరఫరా మెరుగుపడటంతో పాటు బలం కూడా వస్తుంది. పాలతో ఖర్జూరాలను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖర్జూరంలో ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం, పిండి పదార్థాలు, కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, సి, ఇ, బి, జింక్, ఫాస్పరస్, పొటాషియం, కాపర్, ఐరన్ ఉన్నాయి.