ఐరన్ లోపిస్తే బరువు తగ్గుతారట... ఉడికించిన గుడ్డు.. డ్రై ఫ్రూట్స్ తీసుకోండి

మంగళవారం, 10 జనవరి 2017 (12:34 IST)
ఐరన్ లోపం వల్ల లావు తగ్గడంతో.. తరచూ తలనొప్పి.. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కాబట్టి ఐరన్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉడికించిన గుడ్డు చేపలు, బీన్స్‌, ఆకుకూరలు, పచ్చని కూరలు, డ్రైఫ్రూట్స్‌, సోయా, మాంసం, రాగులు వంటివి తీసుకోవాలి. ఐరన్‌ పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. 
 
శరీరానికి ఆక్సిజన్‌ అందించే ఎర్ర రక్తకణాల సంఖ్య పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లను దరిచేరనివ్వదు. శరీరానికి తగిన ఐరన్‌ను ఆహారం ద్వారా అందించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రక్తహీనతతో బాధపడేవారు ఐరన్‌ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. ఇంకా బరువును పెరగరు. బరువు నియంత్రించుకోవాలంటే ఐరన్‌ను తగిన మోతాదులో తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి