యాంటీ ఏజింగ్ ఫుడ్ తీసుకోవడం మరవద్దు... లేదంటే చర్మం ముడతలే...

సోమవారం, 10 ఏప్రియల్ 2017 (20:14 IST)
వయసును అడ్డుకోవడం అనేది ఎవరితరం కాకపోయినా, వయసుకు మించిన వృద్ధుల్లా మారిపోకుండా వయసును తగ్గించే కొన్ని కూరగాయలు, పండ్లు వున్నాయి. వాటిని తీసుకుంటూ వుంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా వుంటాయి. వయసు పైబడినట్లు కనబడకుండా చేసేవాటిలో లైకోపిన్ అనే పదార్థం ఒకటి. ఇది ఎక్కువగా టమోటాల్లో లభ్యమవుతుంది. కూరల్లో టమోటాలను వాడుతూ వుంటాం, ఐతే అప్పుడుప్పుడు బాగా పండిన టమోటాలను పచ్చివే తింటూ వుండాలి. అలా చేస్తే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. 
 
ఇందులో వుండే లైకోపిన్ శరీరం త్వరగా ముడతలు పడిపోకుండా కాపాడుతుంది. ఒకవేళ చర్మం పైపొర దెబ్బతిన్నా మళ్లీ తిరిగి కొత్త చర్మపు పొర ఏర్పడేందుకు విటమిన్ ఇ సహాయపడుతుంది. అందుకని రాత్రిపూట బాదం పప్పులను నానబెట్టి ఉదయాన్ని వాటిని తింటూ వుండాలి. అలాగే పాలకూర కూడా తీసుకుంటూ వుండాలి. ఇది యాంటీ ఏజింగుకు సహాయపడుతుంది. ఇందులో వుండే బీటాకెరొటిన్ చర్మానికి నిగారింపును ఇస్తుంది.

వెబ్దునియా పై చదవండి