తిరుమలలోని తూర్పు బాలాజీ నగర్‌లోని బాల గంగమ్మ ఆలయం సమీపంలో సోమవారం రాత్రి ఒక చిరుతపులి సంచరించరించింది. పులి ఆలయ ప్రాంగణం సమీపంలో పిల్లిని వెంబడిస్తున్నట్లు కనిపించింది. దానిపై దాడి చేసేందుకు చిరుత గోడ పక్కగా నక్కి, నక్కి అక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఆలయంలో విగ్రహాల పక్కన ఉన్న పిల్లికిపైకి ఒక్కసారిగా దూకింది. అయితే పిల్లి మాత్రం చిరుతకు చిక్కలేదు.
అక్కడి నుంచి భయంతో పరుగులు తీసింది. ఆ తర్వాత చిరుత అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది.. తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ సంఘటన మొత్తం ఆలయంలో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలలో రికార్డైంది. ఈ దృశ్యాన్ని చూసిన అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని పరిశీలించి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.