మగవారు ఉల్లిపాయ రసం తాగితే ఏమవుతుంది?

శుక్రవారం, 7 జులై 2023 (19:29 IST)
తల్లి చేయలేని మేలు ఉల్లి చేస్తుందనే సామెత మనకి తెలిసిందే. ఎందుకుంటే ఉల్లిపాయలో ఆవిధమైన పోషకాలు వున్నాయి.  ఉల్లిపాయ రసం స్వతహాగా ఔషధంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాము. జుట్టు రాలడం లేదా బలహీనంగా ఉంటే, ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తే ఫలితం వుంటుంది. ఉల్లిపాయ రసం మగవారు తీసుకుంటే అది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది.
 
ఉల్లిపాయ రసం కళ్లకు కూడా మేలు చేస్తుంది. ఇది కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయ రసం ఇన్ఫెక్షన్‌ను నివారించడంలోనూ, వాపు నుండి ఉపశమనం కలిగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
 
ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, అందుకే వీటిని తినేవారిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా కనబడవు. ఉల్లిపాయ రసంలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు