ఏ రంగు ఆహారం ఏ అవయవానికి ఆరోగ్యం?

బుధవారం, 20 సెప్టెంబరు 2023 (19:42 IST)
శరీరంలోని ప్రతి అవయవానికి ప్రత్యేకించి రంగులతో కూడిన ఆహారం ఉంటుందని నిపుణులు చెబుతారు. వివిధ రంగుల ఆహారాలు శరీరంలోని వివిధ భాగాలకు ఎలా మేలు చేస్తాయో తెలుసుకుందాము. పుచ్చకాయ, జామ, టమోటా, స్ట్రాబెర్రీ, బీట్‌రూట్ వంటి ఎరుపు రంగు పండ్లు గుండెను కాపాడుకోవడానికి మేలు చేస్తాయి.
 
ఆకు కూరలు, గ్రీన్ యాపిల్స్ మొదలైన ఆకుపచ్చని పండ్లు, కూరగాయలు కాలేయాన్ని రక్షిస్తాయి.
ద్రాక్ష, ఉల్లిపాయలు, ఊదా క్యాబేజీ, వంకాయ వంటి ఊదా రంగు కలిగినవి తింటే మెదడు ఆరోగ్యంగా వుంటుంది. ఎండు ద్రాక్ష, బ్లాక్ ఆలివ్ మొదలైన నలుపు రంగు ఆహారం మూత్రపిండాలకు మేలు చేస్తాయి.
 
బంగాళదుంప, వెల్లుల్లి, తెల్ల పుట్టగొడుగు మొదలైన తెలుపు రంగు కలవి ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి. నారింజ, మామిడి, కుంకుమపువ్వు మొదలైనవి ప్లీహము ఆరోగ్యానికి దోహదపడతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు