శీతాకాలంలో రోగనిరోధక శక్తికి.. బెల్లం, ఉసిరికాయను..? (video)

శనివారం, 2 జనవరి 2021 (13:34 IST)
Amla_jaggery
శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆహారంలో చేర్చుకోవాల్సిన  అంశాలపై తెలుసుకుందాం.. శీతాకాలంలో, జలుబు, జ్వరం మరియు కీళ్ల నొప్పులు తప్పవు. అయితే, శీతాకాలంలో వెచ్చని బట్టలు ధరించడం మాత్రమే సరిపోదు. ఆహారంలో వ్యాధినిరోధకతను పెంచే పదార్థాలను చేర్చుకోవాలి. తక్కువ ఉష్ణోగ్రతలు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. రోగనిరోధక శక్తి పెరగడం వల్ల జలుబు, ఫ్లూ కరోనావైరస్ వంటి అనారోగ్యాలను నివారించవచ్చు. అందుచేత రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని ఆహారాలను పరిశీలిద్దాం.
 
ఉసిరికాయ.. 
ఇందులో విటమిన్లు అధికంగా ఉన్నాయి. ఆమ్లాలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ప్రతిరోజూ ఆమ్లా తినడం ద్వారా, అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చు. ఆమ్లా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజూ వీలైతే చలికాలంలో కూడా ఆమ్లా జ్యూస్ తాగవచ్చు. లేదంటే అలాగే తినవచ్చు. ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీటిలో ఆమ్లా జ్యూస్ తీసుకుంటే.. వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు.. కరోనాను దూరంగా వుంచవచ్చు. జలుబును దూరం చేసుకోవచ్చు.
 
పోషకాహారం 
చలికాలంలో పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. శీతాకాలంలో బయటి తిండికి బదులు ఇంట్లో వండే పోషకహారం తీసుకోవాలి. శీతాకాలపు ఆహారంలో మొక్కజొన్న, తృణధాన్యాలు తీసుకోవాలి. పోషకమైన ఆహారం జీర్ణక్రియను బలపరుస్తుంది. ఆహారంలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ అధికంగా ఉండాలి. వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 
బెల్లం
శీతాకాలంలో బెల్లం తినడం వల్ల అనేక వ్యాధుల నుండి దూరంగా వుండవచ్చు. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి కాబట్టి బెల్లం తినాలి. అదేవిధంగా, శీతాకాలంలో బెల్లం వీలైనంత వరకు తినాలి. తృణధాన్యాలతో తయారైన పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.  
 
నెయ్యి
శీతాకాలంలో నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవాలి. నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి రోజువారీ ఆహారంలో నెయ్యి ఒక ముఖ్యమైన భాగం. నెయ్యిలో విటమిన్లు ఎ, కె, ఇ ఉంటాయి. నెయ్యి తినడం వల్ల జుట్టు, చర్మం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల నెయ్యి తినాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు