చలికాలంలో అధికంగా నీటిని సేవించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. చల్లగా ఉండే సమయంలోనే నీళ్లు అధికంగా సేవించాలి. ఆహారంలో వెల్లుల్లి, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. తాజాగా తయారు చేసే ఆహారాన్ని తీసుకోవాలి.
బాదం, జీడిపప్పు, సోయా ఉత్పత్తులను ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గితే వైరస్‌లు ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కాబట్టి వెచ్చగా ఉండేందుకు ప్రయత్నించండి. పచ్చి పండ్లు.. కూరగాయాల్లో క్రిములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ఉడకబెట్టని ఆహారానికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడమే మంచింది. చెప్పులు లేకుండా, లేదా తడి చెప్పులతో నడవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.