అన్నంలోకి పాలు, అటుకుల్లోకి పాలు, పళ్ల ముక్కల్లోకి పాలు.. ఇలా ఎన్నెన్నో ఆహార పదార్థాలతో పాలును కలుపుకుని తాగుతుంటాం. ఐతే కొన్ని పదార్థాలను పాలలో కలుపుకుని తాగకుండా పాలను మాత్రమే తాగితే మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
పండ్ల ముక్కలను చెక్కెర లేదా తేనెతో కలిపి తినడం చేస్తుంటారు కొందరు. ఐతే ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకొందరు సలాడ్లలో ఉప్పు కలుపుకుని తింటారు. అది కూడా అనారోగ్యమే. మరికొందరు పుల్లగా వుండే పళ్లను, తీయటి పళ్లను కలిపి తింటారు. ఇది ఆరోగ్యానికి మేలు చేసేది కాదు.
హెల్దీ డైట్ అంటూ కొందరు కూరగాయల ముక్కలు, పళ్ల ముక్కలు కలిపి తినేస్తుంటారు. ఇది కూడా తప్పే. పండ్లు తిన్న తర్వాత నాలుగైదు గంటలు ఆగి కూరగాయల ముక్కలు తీసుకోవచ్చు. భోజనం తర్వాత పళ్లను తీసుకోవడం కొందరు చేస్తుంటారు. ఇలా చేయకూడదు. భోజనానికి రెండు గంటల ముందు మితంగా ఏమయినా పళ్లను తినవచ్చు.