మెడనొప్పులతో బాధపడేవారు మకరాసనం వేయడం వలన ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా టైప్ ఇనిస్టిట్యూట్‌లలో పనిచేసేవారు, ప్రెస్ కంపోజింగ్ పనిలో ఉండేవారు, కంప్యూటర్ ఆపరేటర్లు, లెక్కలు రాసేవారు, పుస్తకాలు చదివేవారు ఎక్కువగా మెడనొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటివారు రాత్రి భోజనానికి ముందుగా ఈ మకరాసనం వేయడమ మంచిది.
మకరాసనం అనగా ముందుగా మకరం అంటే మెుసలి అని అర్థం, ఆసనం అనగా మెుసలి రూపంలో ఉంటుంది. దీనికి నిరాలంబాసనం అనే మరో పేరు కూడా ఉంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే ముందుగా బోర్లా పడుకుని భుజంగాసనంలాగా వేయాలి. రెండు చేతులను చుబుకం కింద ఆనించి, బుగ్గలను ఒత్తుతూ ఉండాలి. అలాగే రెండు మోచేతులను జోడించి నేలపై ఉంచి శ్వాసను సామాన్యంగా పీలుస్తూ, కళ్లు మూసుకుని, మెడమీద మనస్సును నిలపాలి.