పండుగలు జరిగినా సరే, శుభకార్యాలు జరిగినా సరే.. కష్టమొచ్చినా-నష్టమొచ్చినా మనం దేవుళ్లను పూజిస్తుంటాం. హిందూ సాంప్రదాయంలో ముక్కోటి దేవతలు ఉన్నారు. ఆ ముక్కోటి దేవతలను భక్తులు పూజిస్తుంటారు. అయితే మనం దేవుళ్లు పూజిస్తుంటాం కాని ఆ దేవుళ్లు కూడా వేరే దేవుళ్లను కొలుస్తారన్న అనే విషయం చాలా మందికి తెలీదు... వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
ముక్కంటి దేవుడు మహాశివుడు ఎక్కువ సమయం ధ్యానంలోనే ఉంటాడు. ధ్యాన సమయంలో శివుడు శ్రీరామ అనే నామాన్ని జపిస్తాడట. విష్ణువు ఓం నమ: శివాయ అని, ఆంజనేయుడు శ్రీరామా అంటూ నామస్మరణ చేస్తారు. ఇలా దేవతలంతా శివుడిని ఎలా పూజిస్తారో తెలుసుకుందాం..
యమధర్మరాజు - గోమేధక లింగం,
ఇంద్రుడు - పద్మరాగ లింగం,
బ్రహ్మ - స్వర్ణంతో చేసిన లింగం,
అశ్వినీదేవతలు - మట్టితో చేసిన లింగం
సరస్వతి - స్వర్ణంతో చేసిన లింగం,
వాయుదేవుడు - ఇత్తడితో తయారు చేసిన లింగం,
చంద్రుడు - ముత్యంతో తయారు చేసిన లింగం,
కుబేరుడు - స్వర్ణంతో చేసిన లింగం,
నాగు - పగడపు లింగాన్ని పూజిస్తారు.