దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. మొదటిసారి తిరుమల స్వామివారి సన్నిధిలో అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఎప్పటి నుంచో శ్రీవారిపై సినిమాలు తీస్తున్న రాఘవేంద్రరావుకు స్వామివారు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయనకు సిఎం అవకాశం ఇచ్చారు. రెండేళ్ళ పాటు పాలకమండలిలో కొనసాగిన రాఘవేంద్రరావు వివాద రహితుడిగా పనిచేశారు. తన వారికి కూడా సేవా టిక్కెట్లు తీసివ్వకుండా సామాన్య భక్తుల కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాదు టిటిడి ఎస్వీబిసీ ఛానల్‌ను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేశాడు.
అయితే రాఘవేంద్రరావు పదవీకాలం ముగిసింది. పాలకమండలి మొత్తం తట్టాబుట్టా సర్దేశింది. అయితే కొత్త పాలకమండలిలో తిరిగి రాఘవేంద్రరావుకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారట. దర్శకేంద్రుడు అడగకపోయినా ఆయనకు అవకాశం ఇవ్వాలన్నది సిఎం ఉద్దేశమట. అందుకే కొత్త పాలకమండలిలో రాఘవేంద్రరావు పేరు ఉండేటట్లుగా చూడాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంమీద మరోసారి దర్శకేంద్రుడికి శ్రీవారి సన్నిధిలో పనిచేసే అవకాశం రానుంది.