పితృదేవతల పటాలు ఇంట్లో వుంచవచ్చా అనే అంశంపై అనేక అనుమానాలు చాలామందికి వున్నాయి. అలాంటి అనుమానం మీకు వుంటే.. కుటుంబం నుంచి మరణించిన తాత, ముత్తాతల ఫోటోలను పూజగదిలో కాకుండా వారికి ప్రత్యేక అలమరాను ఏర్పాటు చేసుకుని అక్కడ వుంచవచ్చు. లేదా గోడకు తగిలించవచ్చు.
గోడకు తగిలించే పితృదేవతల పటాలు.. పూజ గది కంటే ఎత్తైన ప్రాంతంలో వుండేలా చూసుకోవాలి. ఉత్తరం వైపు గోడకు తగిలింది.. దక్షిణం వైపు ఆ పటాలు చూసేలా తగిలించాలి. అంతేకానీ పూజగదిలో మాత్రం పితృదేవతల పటాలు అస్సలు వుండకూడదు.
అలాగే పితృదేవతలకు సపరేటుగా దీపం వెలిగించాలి. ఇతర దేవతలకు ఉపయోగించే దీపాలు వీరికి ఉపయోగించకూడదు. ప్రమిదలతో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజూ దీపం వెలిగించి, అగరవత్తులు, కర్పూరం సమర్పించవచ్చు.
అమావాస్య, వారు మరణించిన తిథుల్లో వారికి ఇష్టమైన పదార్థాలను వండి సమర్పించవచ్చు. దేవతా పూజ తరహాలో ధూప,దీప నైవేద్యం సమర్పించవచ్చు. కానీ పితృదేవతల ఫోటోలకు ఇవన్నీ సపరేటుగా చేయాల్సి వుంటుంది. పుట్టినిల్లు లేదా మెట్టినిల్లు ఏదైనా మహిళలు పితృదేవతలకు పూజలు చేయొచ్చు.
ఇలా చేయడం ద్వారా పితృదేవతలకు ఆత్మశాంతి చేకూరుతుంది. ఇంకా ఇంటిల్లపాది సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంకా వంశాభివృద్ధి చేకూరుతుంది. కుటుంబ సౌఖ్యం వుంటుంది. దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. పితృదేవతల ఆశీర్వాదంతో ఆ ఇంట ఈతిబాధలు వుండవు.
ఇంకా ఇవి తప్పనిసరి
మరణించిన వారి ఫోటోలను బెడ్‌రూమ్‌లో లేదా కిడ్స్ రూమ్‌లో ఉంచకూడదు.
పితృదేవతల ఫోటోలు కనీసం 6.5 నుండి 7 అడుగుల ఎత్తులో ఉంచాలి
ఉత్తర దిశ వైపు ఈ ఫోటోలను వుంచాలి.
వారికి నివాళులు అర్పించే వ్యక్తి దక్షిణ దిశ వైపు ఉండాలి.
టాయిలెట్ లేదా బాత్రూమ్ గోడను తాకేలా పితృదేవతల ఫోటోలను తగిలించకూడు.
ఇంటి ప్రధాన ద్వారం ముందు గోడపై కూడా వాటిని ఉంచవద్దు.
పితృదేవతల ఫోటోలను లివింగ్ రూమ్ లేదా డైనింగ్ ఏరియా వంటి ప్రాంతాల్లో నైరుతి మూలలో దక్షిణాన ఉంచాలి.
కాగా పితృ దేవతల ఫోటోలను ఇంట్లో ఉంచుకోకూడదని చెప్పే శాస్త్రీయ గ్రంథం లేదు. పితృదేవతలకు అనేక విధాలుగా కృతజ్ఞతతో ఉండాలి. పితృదేవతలను పూజించడం, ఇంట్లో వున్న పెద్దలను గౌరవించడం.. వారి ఆశీర్వాదం తీసుకుంటే జీవితంలో బాగా రాణించే అవకాశం ఉంది.