31-07-2025 గురువారం ఫలితాలు - పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం....

రామన్

గురువారం, 31 జులై 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. పెద్దల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ప్రయాణంలో జాగ్రత్త.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. మితంగా సంభాషించండి. విమర్శలెదుర్కోవలసి వస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కీలక పత్రాలు అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ రోజు కలిసివచ్చే సమయం. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వాగ్ధాటితో రాణిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. పనులు వేగవంతమవుతాయి. వ్యవహారంలో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ కష్టం ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆప్తులకు సాయం చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. యోగాపై దృష్టి సారిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతికూలతలు అధికం. కష్టించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు అప్పగించవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రావలసిన ధనం అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అనవసర జోక్యం తగదు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. దంపతుల స్వల్ప కలహం. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు