ఈ రోజున మాత్రం రాత్రివేళ ఉప్పులేని ఆహారాన్ని తినాలి...?

మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:44 IST)
సాధారణంగా భక్తులు హిందూ దేవుళ్లలను, దేవతలను ఒక్కొక్కరినీ ఒక్కో రోజున పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం రోజున హనుమంతునికి పూజలు చేస్తారు. ఈ రోజున కొందరైతే ఆలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు. మరికొందరైతే ఇంట్లోనే చేస్తారు. చాలామంది ఉపవాసం ఉండి స్వామివారికి భక్తిలో పూజలు చేస్తుంటారు. మరి మంగళవారం రోజున క్రింద చెప్పిన విధంగా స్వామివారిని ప్రార్థించే కలిగే శుభాలు ఓసారి తెలుసుకుందాం..
 
కొత్తగా పెళ్లయినవారు మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమంతునికి పూజలు చేస్తే త్వరగా పిల్లలు పుడతారని పండితులు చెప్తున్నారు. ఒకవేళ దంపతుల్లో ఏవైనా దోషాలు ఉన్నాకూడా తొలగిపోతాయి. అలానే వారిలో దుష్ట శక్తుల ప్రభావం పోయి పిల్లలు చక్కగా పుడతారు. ముఖ్యంగా ఈ రోజున మాత్రం రాత్రివేళ ఉప్పులేని ఆహారాన్ని తినాలి. అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం దక్కుతుంది.
 
మంగళవారం రోజున ఎరుపురంగు దుస్తులు ధరించి.. స్వామివారికి ఎరుపురంగు పువ్వులతో పూజలు చేయాలి. ఇలా చేయడం వలన స్వామివారి ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా శనిగ్రహదోషాలు ఉంటే పోతాయి. కొందరైతే ఎప్పుడూ చూసిన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు.. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి హనుమంతుని పూజిస్తే తప్పక ఆరోగ్యం బాగుపడుతుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు